Tuesday, January 21, 2025

ఒకే కాన్పులో నలుగురు.. తల్లి, పిల్లలు క్షేమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సహజం. అరుదుగా ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు ఉన్నాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరారు. ఇది ఆమెకు రెండో కాన్పు. మొదటి కాన్పులో బాబు.. అతనికి 9 ఏళ్లు, రెండో కాన్పులో తొలుత బాబు, తరువాత పాప, అనంతరం మరో ఇద్దరు బాబులు జన్మించారు. వీరికి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News