Wednesday, January 22, 2025

మహిళా వైద్యురాలితో అఫ్తాబ్ డేటింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన కొద్దిరోజుల అనంతరం అఫ్తాబ్ మరో మహిళతో డేటింగ్ ఆరంభించాడు. అఫ్తాబ్ డేటింగ్ చేస్తున్న మహిళను ఓ వైద్యురాలిగా గుర్తించారు. వృత్తిపరంగా వైద్యురాలైన ఆ మహిళను అఫ్తాబ్ శ్రద్ధాను కలిసిన యాప్ ద్వారానే కలిసి పరిచయం పెంచుకున్నాడు. శద్ధ్రా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే మరో మహిళను అదే అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ఇంతకుముందే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా యాప్ బంబుల్ ప్రతినిధులను కలిసిన పోలీసులు అఫ్తాబ్ వివరాలుతోపాటు అఫ్తాబ్ కలిసి ఇతర మహిళల వివరాలను సేకరించారు. సైకాలజిస్ట్ అయిన ఆమెను ఢిల్లీ పోలీసులు కలిసి అఫ్తాబ్‌తో డేటింగ్‌పై విచారించారు.

కాగా తనతోపాటు సహజీవనం చేస్తున్నశ్రద్ధావాకర్‌ను గొంతునులిమి చంపి ఆమె శరీరాన్ని 35ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. మే 18న జరిగిన ఈ హత్య ఈ నెలారంభంలో అఫ్తాబ్ అరెస్టయిన తరువాత వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో శుక్రవారం రోహిణిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పోలీసులు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్ పరీక్ష) టెస్టు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అంబేద్కర్ ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.ఢిల్లీ న్యాయస్థానం నిందితుడికి 8వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు తీహార్‌జైలుకు తరలించారు. అఫ్తాబ్‌ను మీడియా, ప్రజలకు దూరంగా ఉంచేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలిగ్రాఫ్ ఫలితాలను విశ్లేషించిన అనంతరం అఫ్తాబ్‌కు సోమవారం నార్కోటెస్టు నిర్వహించనున్నట్లు ఫొరెన్సిక్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News