Thursday, January 23, 2025

ట్రాఫిక్ సిగ్నల్ కాడ అక్క ఆఫీస్ వర్క్… వార్త వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశవాణి సెంటర్‌ ఎదురుగా ఉన్న అసెంబ్లీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో, మహిళ తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్‌లో షేర్ చేయగా, అది ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఆ మహిళ అంకితభావం, పని తీరుకు నెటిజన్లు ముగ్ధులయ్యారు, చాలా మంది ఆమె సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News