Sunday, January 19, 2025

ప్రియురాలిని 8 ముక్కలుగా నరికి…. చెరువులో తలను పడేసి

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలిని ఎనిమిది ముక్కలుగా నరికి ప్రియుడు బావిలో పడేశాడు. మొండెం లేని తలను చెరువులో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అజమ్‌గఢ్‌లో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రిన్స్ యాదవ్ అనే వ్యక్తి విదేశాలలో నివసించేవాడు. యాదవ్‌కు ఆరాధాన అనే ప్రియురాలు ఉంది. యాదవ్ విదేశాలలో ఉండడంతో గత ఫిబ్రవరిలో మరో వ్యక్తితో ఆరాధానకు పెళ్లి చేశారు. ఇండియాకు వచ్చిన తరువాత ఆరాధానను యాదవ్ కలిశాడు. భర్తతో విడాకులు తీసుకొని తన దగ్గరకు రావాలని ఆమెను బలవంతం పెట్టాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

నవంబర్ 10న దేవాలయానికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమె గొంతు నులిమి చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరుచేశాడు. మొండాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. అనంతరం తలను చెరువులో పడేశాడు. అజమ్‌గడ్ ప్రాంతంలోని పశ్చామి గ్రామంలో బావిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. మృతదేహం ఆరాధానదిగా గుర్తించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో యాదవ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎస్‌పి అనురాగ్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News