రోహ్‌తక్: హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ మహిళ కాంగ్రెస్ కార్యకర్త మృతదేహం సూట్‌కేసులో లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. శుక్రవారం సంప్లా బస్టాండ్ సమీపంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే స్థానికుల సమాచారం అందించడంతో ఎఎఎఫ్ఐ అధికారులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 20-22 సంవత్సరాల మధ్య ఉన్నట్లు గుర్తించారు. ఆమె మెడ చుట్టు స్కార్ఫ్ బిగించి ఉంది.
దీనిపై సంప్లా ఎస్‌హెఇ బిజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. అమ్మాయిని హత్య చేసి ఆ తర్వాత సూట్‌కేసులో పెట్టారని అన్నారు. ఈ హత్య కేసులో నిందితుడిని త్వరగా పట్టుకుంటమాని హామీ ఇచ్చారు. అయితే హత్యకు గురైన అమ్మాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హిమని నర్వాల్ అని ఎమ్మెల్యే భారత్ భూషన్ భత్రా ఆరోపించడంతో తీవ్ర దుమారం రేగింది. హిమని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేసిందని తెలిపారు .
కాంగ్రెస్ పార్టీ హర్యానా అధ్యక్షడు భుపిందర్ సింగ్ హుడా కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆమె మృతి సంతాపం తెలిపిన ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హత్యపై ఉన్నత స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.