Monday, December 23, 2024

మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళితే పెళ్లి ప్యాకప్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అందాన్ని మెరుగుపరుచుకోవడానికి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి కురూపిగా మారిన పెళ్లికూతురితో పెళ్లికొడుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ వింత సంఘటన కర్నాటకలోని హసన్ జిల్లా అర్కిసకెరె గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి పెళ్లికి ఓకే చెప్పేశాడు ఆ అబ్బాయి.

ఇక పెళ్లి రోజు వచ్చేసింది. పెళ్లి పీటలు ఎక్కడానికి ముందు మరింత అందంగా తయారవ్వాలనుకుంది వధువు. దగ్గర్లో ఉన్న బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఇదో కొత్త రకం పద్ధతంటూ వధువుపై ఏదో ప్రయోగం చేసింది ఆ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు. మేకప్ పూర్తయ్యేటప్పటికీ వధువు ముఖం నల్లగా మారిపోవడంతోపాటు వాచిపోయింది.

అందంగా ఉన్న వధువు కాస్త అంధవిహీనంగా తయారైంది. ఏం చేయాలో పాలుపోక అలాగే పెళ్లికి రెడీ అయిపోయింది వధువు. అయితే పెళ్లి కుమార్తె కొత్త రూపం చూసి షాకైపోయాడు వరుడు. ఈ పిల్లను నేను పెళ్లి చేసుకోనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు పెళ్లి రద్దయిపోయింది. ఈ పరిస్థితికి కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై వధువు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News