Monday, December 23, 2024

మసీదులో మహిళలు నమాజు చేయొచ్చు, కానీ…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పుస్తకాలు, సిద్ధాంతాలు, విశ్వాసాల ప్రకారం మసీదులో మహిళలు నమాజు చేసుకోవచ్చు, కానీ వారు స్వేచ్ఛగా మగవారితో కలిసిమెలిసి ఉండడానికి లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, సుప్రీం కోర్టుకు తెలిపింది. మసీదులో మగవారితో కలిసిమెలిసి స్వేచ్ఛగా మసలడానికి ఏ ఆధ్యాత్మిక పుస్తకం అనుమతించలేదని తన అఫిడవిట్‌లో పేర్కొంది.

మక్కాలోని కాబా పరిసరాలలో నమాజు చేయడానికి కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరుగుతుంటుందని, పురుషులు, మహిళలు సమ్మిళితం కాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారని పేర్కొంది. పురుషులు, మహిళలు ఉన్నప్పటికీ వేర్వేరుగానే నమాజు చేస్తారని తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. నమాజు చేసేప్పుడు పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా స్త్రీపురుషులు కలిసిమెలిసి నమాజు చేయడానికి లేదు. విశ్వాసులు పురుషులైనా, మహిళలైన తమకు కేటాయించిన ప్రదేశాలలోనే నమాజు చేయాల్సి ఉంటుంది.

వాస్తవానికి మక్కాలో అల్‌హరమ్ మసీదు కాక ఇంకా అనేక మసీదులు ఉన్నాయి. ప్రవక్త(స) ముహమ్మద్ కాలం నాటి నుంచే స్త్రీపురుషులు కలిసిమెలిసి తిరుగాడడానికి వీలులేదని తన అఫిడవిట్‌లో ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది.

Salaah 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News