Saturday, November 23, 2024

ప్రాణాంతకంగా మారిన గైనకాలజిక్ క్యాన్సర్

- Advertisement -
- Advertisement -

Women are being diagnosed with Gynecological Cancer

మూడు రకాల క్యాన్సర్లలతో మహిళలు ఇబ్బందులు
అవగాహన ద్వారా వ్యాధి నుంచి జయించవచ్చంటున్న వైద్యులు
కుటుంబంలో నేపథ్యం ఉన్నవారు తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి

హైదరాబాద్ : నగరంలో ఇటీవల కాలంలో గైనకాలజిక్ క్యాన్సర్‌కు చాలా మంది మహిళలు గురైతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు రోగాలపై అవగాహన లేకపోవడం, వేళకు ఆహారం తీసుకోకపోవడంతో పాటు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడంతో క్యాన్సర్ దాడి చేసిందని పేర్కొంటున్నారు. గైనకాలజిక్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పిస్తే దాని నుంచి బయటపడవచ్చని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు మూడు రకాల గైనకాలజిక్ క్యాన్సర్లు ఎదుర్కొంటున్నట్లు అపోలో ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డా. కె.శిల్పారెడ్డి తెలిపారు.

గర్భశాయ క్యాన్సర్ : ఇది మహిళలో సాధారణంగా సంభవించే ప్రాణాంతకత క్యాన్సర్. గర్భాశయం దిగువ బాగంలో ఏర్పడి హెచ్‌పివి అనే ఇన్‌ఫెక్షన్‌తో ముడిపడి ఉందంటున్నారు. దీనికి నానోవాలెంట్ గార్డాసిల్ వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చని, రెగ్యులర్ పాప్ స్మెర్స్, హెచ్‌పివి పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చన్నారు. ప్రారంభ సర్వైకల్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్సతో కలిపి చికిత్స ఎంపికలు ఉంటాయని, ప్రారంభ దశలో వ్యాధి స్దూలంగా, స్దానికంగా బాగా వృద్ది చెందిన దశలో, రేడియేషన్ థెరపీతో పాటు కీమోథెరపీ, బ్రాచిథెరపీ చికిత్సలు చేస్తామని తెలిపారు. వ్యాధి లక్షణాలు సాధారణ పీరియడ్‌ల మధ్య స్త్రీ జననేంద్రియ నుంచి రక్తస్రావ, కంటినొప్పి, డిశ్చార్జ్…

ఎండోమెట్రియల్ క్యాన్సర్ : జీవనశైలి, అలవాట్లు, ఊబకాయం, హార్మోన్ మాత్రల వాడకం, కుటుంబ చరిత్ర వంటి అనేక కారణాలతో సంభవించే అవకాశం ఉందని, గర్భాశయం, దాని లైనింగ్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతకత క్యాన్సర్, సాధారణంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఇది వచ్చే చాన్స్ ఉందని సూచిస్తున్నారు. చిన్నవయస్సులో ఉన్న వారిలో కూడా వ్యాధి పెరుగుదల కనిపిస్తుంది. గర్భాశయ కుహరం లైనింగ్ అర్దం చేసుకోవడానికి ఒక సాధారణ అల్ట్రాసౌండ్ సరిపోతుందని, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ కోసం నిర్దిష్ట మార్గదర్శకాలు అంటూ ఏమిలేవన్నారు.

ఒక సాధారణ యూఎస్‌జి,పాప్ స్మెర్‌లు వ్యాధిని ముందుస్తుగా గుర్తించడంలో సహాయపడుతాయి. చికిత్సలలో శస్త్రచికిత్స ప్రధానమైనదని, తరువాత ప్రమాద కారకాల ఆధారంగా రేడియేషన్ థెరపీ, కెమోథెరపీలు అవసరమైతాయని, అధునాతన మెటాస్టాటిక్ కేసుల్లో, కీమోథెరపీ కాకుండా, టార్గెట్‌డ్ ఏజెంట్లు, ఇమ్యునోథెరపీని మాలిక్యులర్ మార్కర్ల ఆధారంగా పరిగణించవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలు రుతుక్రమం ఆగిపోయిన తరువాత స్త్రీ జననేంద్రియ నుంచి రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి ఉంటుంది.

అండాశయ క్యాన్సర్ : ఇది అండాశయాల్లో ప్రారంభమయ్యే క్యాన్సర్ ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ 50ఏళ్లుపైబడిన వయస్సు, రొమ్ము, అండాశయ క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉండటం వంటి ప్రమాద కారకాలతో ఇది ముడిపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారిలో చాలామందికి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన దశ వరకు గుర్తించలేరు. ప్రారంభ దశ చికిత్స ప్రధానంగా శస్త్రచికిత్స తరువాత అవసరమైతే కీమోథెరపీ అందించబడుతుంది. అధునాతన దశలకు కీమోథెరపీ,శస్త్రచికిత్స రెండు అవసరం. ఈరోజుల్లో బిఆర్‌సిఎ ఉత్పరివర్తనలు సానుకూలంగా ఉంటే నిర్వహణ లక్షంగా ఉన్న ఏజెంట్లు పాత్ర కూడా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కొంచెం తినగానే కడుపు నిండిన భావన, కడుపు ఉబ్బరం, బరువు తగ్గడం ఉంటుంది.

ముందుస్తుగా గుర్తించాలి : 30 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత క్రమం తప్పకుండా పాప్ స్మెర్‌తో హెచ్‌పివి పరీక్ష, సందేహం ఉంటే అల్ట్రాసౌండ్‌తో సీరం సిఎ 125 ట్యూమర్ మార్కర్ గుర్తించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News