Monday, December 23, 2024

కేరళ బార్లలో పనిచేయడానికి మహిళలకు అనుమతి లేదా?..

- Advertisement -
- Advertisement -

Kerala Bars working women
తిరువనంతపురం: ఇక్కడి హోటల్ వైట్ డమర్ ఇంటర్నేషనల్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు ధన్యమోల్ సిజె, సోనియా దాస్ 2015లో బార్‌లు, హోటళ్లలో మహిళలు మద్యం సర్వ్ చేయడంపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించినందుకు న్యాయపోరాటం చేశారు. కేరళ హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పనిచేసే వారి స్వేచ్ఛను సమర్థించింది. రక్షణ సాకుతో వారి పని స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించడం వారిని బలిపశువులను చేస్తుందని పేర్కొంది. అయితే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇదే రకమైన కేసు 2022 మార్చి 15న వెలుగుచూసింది. కొచ్చిలోని ఒక హోటల్ యజమాని మద్యం అందించడానికి మహిళలను నియమించినందుకు, స్టాక్ రిజిష్టరును నిర్వహించనందుకు అరెస్టయ్యాడు. సోషల్ మీడియాలో ప్రసారమైన బార్ ప్రారంభోత్సవ వీడియోల్లో ఇతర దేశాలకు చెందిన మహిళలు సర్వ్ చేస్తున్నట్లు చూపారు. ఫారిన్ లిక్కర్ రూల్స్‌లోని రూల్ 27ఎ, లైసెన్సు షరతులు 12, 9ఎ, కేరళ అబ్కారీ చట్టంలోని సెక్షన్ 56బి ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
రూల్ 27ఎని 2013 విదేశీ మద్యం నియమాలులో డిసెంబర్ 9 న జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా చేర్చారు. ‘లైసెన్సు పొందిన ప్రాంగణాల్లో మద్యం సర్వ్ చేయడానికి ఏ మహిళను నియమించకూడదు’ అన్నది రూల్. కాగా మద్యం సర్వ్ చేయడానికి మహిళలను వినియోగించుకుంటున్నారని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. కోర్టు ఆదేశాల తర్వాత కూడా కేరళ ప్రభుత్వం 2013 నాటి నిబంధనలు సవరించలేదని తెలిసింది. రాష్ట్రంలో మద్యం పర్మిట్లు కలిగిన హోటళ్లు, ఆమోదింత రెస్టారెంట్లు, రిసార్టులు, హెరిటేజ్ హోటళ్లలో చాలా మంది మహిళలు పనిచేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారమేనని కేరళ హోటల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. సునీల్ కుమార్ తెలిపారు. ఆయన ధన్యమోల్, సోనియా పనిచేసి వైట్ డమ్మార్ ఇంటర్నేషనల్ యజమాని కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News