Wednesday, January 22, 2025

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే టార్గెట్.. లేడీ డాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

గంజాయి అమ్ముతూ ఎక్కడో అక్కడ గ్యాంగ్ లు పట్టుబడుతునే ఉంటాయి. కానీ మహిళలు గంజాయి విక్రయించడం అనేది ఇప్పటి వరకు పెద్దగా చూడలేదు. కానీ నగరం నడిబోడ్డున నానక్‌రామ్ గూడ ఓ లేడీ డాన్ ను గంజాయి అమ్ముతూ పోలీసులు చిక్కింది. ఈ మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ లను టార్గెట్ చేసి గంజాయి అమ్ముతోంది. ప్రతిరోజు రూ. 20 లక్షలు విలువ చేసే గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ గంజాయి అమ్మకం ద్వారా వందల కోట్ల రూపాయల సంపాదించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమెకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News