- Advertisement -
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమీర్ పేటకు చెందిన అమీర్ సోహేల్ మహ్మద్ అనే యవకుడు, ఓ అమ్మాయితో కలిసి శంషాబాద్ నుంచి మెహిదీపట్నంకు వెళ్తున్నారు. యువతి కారు వేగంగా ఓ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో చేతికి గాయమైంది. కొంచెందూరం వెళ్లిన తరువాత మరో వాహనాన్ని ఢీకొట్టడంతో స్థానికులు అప్రమత్తమై కారును ఆపారు. దీంతో యువతి, యువకులు స్థానికులతో గొడవకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్వాస పరీక్ష చేయగా యువతికి 200, యువకుడుకి 500 ఉన్నట్లు తేలింది. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -