Monday, December 23, 2024

అన్ని రంగాల్లో అగ్రభాగాన మహిళలు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : మహిళలు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాలలో రాణిస్తూ అగ్రభాగాన నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వనపర్తి పట్టణంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆ యన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భ ంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మహిళలు విద్య అభ్యసించకపోవడం, బాల్య వివాహాలు ఉండేవని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కుటుంబంలో చిన్న వయస్సు నుంచి బాలికల ను, బాలురను సమానంగా పెంచాలని, స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమేనని ఆయన అన్నారు.

ప్రతి పనిలోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, లింగ వివక్ష రూపుమాపాలని ఆయన అన్నా రు. భారత దేశంలో అత్యధిక జనాభా, గ్రామాలు ఉండడం, వ్యవసాయ రంగం ప్రధాన వ్యక్తిగా ఉండడం చేత మహిళలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశ ం గా మహిళలు అన్ని రంగాలలో ముందు వరుస లో ఉన్నారని ఆ యన అన్నారు. మ హిళలను స్త్రీ మూర్తిగా ఆరాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఝాన్సీ లక్ష్మిబాయి, రాణి రుద్రమదేవి, సమ్మక్క, సారక్క, సావిత్రిబాయి పూలే, ఇందిరాగాంధీ వంటి మహిళలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి సూచించారు.

నేటి తరంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుని విజయాలు సాధిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మంత్రి మహి ళా సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ మహిళలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయిలను అధిరోహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం మహిళా పారిశ్రామికులను ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం మ హిళా పారిశ్రామికులను ప్రోత్సహిస్తుందని, మహిళలు ఎంతో నైపుణ్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారని ఆయన అన్నారు. వివిధ రంగాలలో అభివృద్ధి సాధించిన మహిళలను గుర్తిస్తూ ప్ర శంసా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఆర్డిఓ పద్మావతి, జిల్లా అధికారులు, మహిళలు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News