Monday, December 23, 2024

జూబ్లీహిల్స్ స్థానిక మహిళ కార్పొరేటర్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ ఘటనలో స్థానిక మహిళ కార్పొరేటర్‌పై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేశారు.
దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా మాగంటి గోపీనాధ్ అరాచకాలు ఎక్కువ అయిపోయాయంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. కాగా, కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News