Monday, December 23, 2024

అర్థరాత్రి ఒంటరిగా అబల…. బైక్ ఫై పోకిరీలు… వీడియో చూస్తే మైండ్ బ్లాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమ్మాయిలు పగటిపూట ఒంటరిగా నడవాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై వెళ్తున్న మహిళలపై పలుమార్లు అత్యాచారాలు జరిగిన విషయం తెలిసిందే. మృగాళ్లు అమ్మాయిలపై దాడులు చేస్తునే ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిలను వలలో వేసుకొని ముక్కలు ముక్కలుగా నరికిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మహిళలు బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఓ యువతి అర్ధరాత్రి నడి రోడ్డుపై నడుచుకుంటు వెళ్తోంది. ఇద్దరు యువకులు ఆమె వద్దకు రావడంతో వాళ్లతో తనకు ప్రాణాపాయం ఉందని అనుకొని పిస్తోల్‌తో కాల్పులు జరిపింది.

Also Read: చితిపై లేచికూర్చున్న శవం..పరుగులు తీసిన బంధుజనం

ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్ గాయాలు కావడంతో కొంచెందూరం పరుగు ఎత్తుకెళ్లి  కిందపడిపోయారు. సిసి కెమెరాలో రికార్డు కావడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో ఉన్న మహిళలకు తుపాకులు లైసెన్స్ తుపాకులు ఇస్తే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలు అఘాయిత్యాలు ఆగడంలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అర్థరాత్రి మహిళ నడిచిన రోజే అసలైన స్వాత్రంత్యం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News