Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ మాగంటిపై మహిళలు చెప్పులతో దాడి

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై మహిళలు చెప్పులతో దాడి చేసిన సంఘటన గురువారం బోరబండలో జరిగింది.  పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందుకు రాగానే స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు.

అదే సమయంలో అటువైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ర్యాలీగా అక్కడికి వచ్చాడు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తన పక్కన ఉన్న ప్రధాన అనుచరుడు విజయ్‌సింహను మీసం తిప్పమని చెప్పడంతో అతడు మీసం తిప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన మహిళలు వాటర్ బాటిళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఓ మహిళాపై అత్యాచారం చేయడమే కాకుండా, మీసం తిప్పుతావా అంటూ చెప్పుల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News