Monday, December 23, 2024

బైకుపై యువతులు.. హైవే తనదంటూ వ్యక్తి చిందులు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటున్న వేళ.. ఇద్దరు మహిళా బైకర్లకు నడిరోడ్డుపై ఘోర అవమానం జరిగింది. దప్పిక తీర్చుకోవడానికి ప్రధాన రహదారిలో బైకులు ఆపిన ఇద్దరు మహిళల పట్ల ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తించడమేగాక ఈ రోడ్డు తనదంటూ బెదిరించాడు. బైకు తాళం లాక్కుని వేధించాడు. బెంగళూరు శివార్లలోని బన్నెర్‌ఘట్ట వద్ద నైస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన బైక్ రైడ్‌లో పాల్గొని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న షరోన్ సామ్యూల్, ప్రియాంక ప్రసాద్ అనే యువతులు రోడ్డు ప్రక్కన వైకులు నిలిపి మంచినీళ్లు తాగుతున్నారు. ఇంతలో ఒక నడివయసు వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇక్కడ బైకులు ఆపవద్దని, ఇది తన సొంత స్థలమని చెప్పాడు. తాము రోడ్డు పక్కనే వాహనాలు నిలిపామని చెబుతుండగా తన సొంత స్థలంలో నిలుచుని మీరు మాట్లాడుతున్నారంటూ అతను మందలించాడు. తాను అడ్వకేట్‌నని, ఇక్కడ మీకేం పనంటూ అతను ప్రశ్నించాడు.

అతనికి నచ్చచెప్పేందుకు వారిద్దరూ ప్రయత్నించగా ఇక్కడ మంచినీళ్లు తాగడానికి వీల్లేదని, ముందుకు వెళ్లి తాగాలని అతను చెప్పాడు. తాము చేసిన తప్పేమిటో అర్థం కాక ఆ యువతులు అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అతను స్వరం పెంచుతూ వెళతారా..పోలీసులను పిలవమంటారా అంటూ బెదిరించాడు.
అంతటితో ఆగకుండా ఒక బైకు నుంచి తాళం లాక్కున్నాడు. ఇప్పుడు మీ సంగతేమిటో తేలుస్తాను అంటూ బైక్ కీస్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇంతలో పోలీసులు ఈక్కడకు చేరుకుని ఆ వ్యక్తి నుంచి బండి కీస్‌ను ఆ యువతులకు అప్పగించారు. ఈ దృశ్యాన్ని వసీమ్ అనే యూజర్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News