Thursday, January 23, 2025

మహిళా బిల్లు తీసుకరావాలి: కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు తీసుకరావాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. మహిళల హక్కుల కోసం భారత జాగృతి పోరాడుతోందన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే జనగణన చేపట్టాలన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో భారత్ జాగృతి దీక్ష చేయనుంది. భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10న జంతర్‌మంతర్ దగ్గర నిరసన చేపటనున్నారు.

జంతర్ మంతర్ దగ్గర ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిరాహారదీక్ష చేపడుతామని కవిత వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ మేరకు ఎంపి సీట్లు పెంచాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే సూచించామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళ సంఘాలను ఆహ్వానించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News