Monday, December 23, 2024

బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవితపై అదే పనిగా నోరుపారేసుకుంటున్న బండి సంజయ్‌ను బిఆర్‌ఎస్ మహిళలు హెచ్చరించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. మహిళా లోకానికి, కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అన్ని చోట్ల బండిపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News