Sunday, December 22, 2024

ఎంఎల్ఎ రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్ఎ రాజయ్య తనను లైగింకంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ధర్మసాగర్ మండలంలోని జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆమె వ్యాఖ్యల ఆధారంగా మహిళా కమిషన్ సుమోటోగా పరిగణలోకి తీసుకుని ఎంఎల్ఎ రాజయ్యకు నోటీసులు అందచేశారు.

రాజయ్యపై సర్పంచ్ చేసిన ఆరోపణలు నిజామా కాదా అనే అంశాలను తేల్చాలంటూ డీజీపీకి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి లేఖ రాశారు. మాట విననందుకు తనపై స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్ఎ రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎంఎల్ఎ కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని, నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News