Friday, September 20, 2024

కెటిఆర్ వ్యాఖ్యలపై సూమోటోగా విచారణ చేపట్టిన మహిళా కమిషన్

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, కె. తారక రామారావు చేసిన మీడియా కామెంట్స్ ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కామెంట్స్ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు అవమానకరమైన స్వభావం కలిగి ఉన్న కారణంగా కమిషన్ దృష్టికి వచ్చింది. తెలంగాణలోని అసంఖ్యాక మహిళా సమాజానికి సంబంధించిన ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలను బాధ కలిగించాయని కమిషన్ గమనించింది. పైన పేర్కొన్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశంపై సూమోటో విచారణను ప్రారంభించిందని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కెటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి : బండ్రు శోభారాణి
మహిళలను చులకన చేసి మాట్లాడుతున్న కెటిఆర్ తన పద్ధతి మార్చుకోవాలని మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి కోరారు. మరోసారి మహిళలను చులకన చేస్తే మహిళల చీపురు దెబ్బలు తింటారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం పై అక్కసుతోనే ఆ స్కీం పై కెటిఆర్ చులకన భావంతో మాట్లాడుతున్నారని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలంటే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారా?, మీకేమన్న తమాషాగా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పబ్బులు క్లబ్బుల సంస్కృతి కెటిఆర్ దని, ఆయన డాన్స్ కల్చర్ ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News