Monday, December 23, 2024

పీరం చెరువు ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

- Advertisement -
- Advertisement -

నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి : చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రంగా రెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడి దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన చాలా బాధాకరమని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాని పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 100, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 లేదా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వాట్సప్ హెల్ఫ్‌లైన్ నెంబర్ 9490555533 కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితురాలికి మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News