Wednesday, January 15, 2025

వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల పెళ్లి నిశ్చితార్థం చేసుకున్న నటుడు నాగచైతన్య, నటి శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండబోరని, ఓ అమ్మాయి కారణంగా విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పినందుకు తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు ఆగస్టు 22 న హాజరుకావలంటూ ఆదేశాలు జారీచేసింది.

నాగచైతన్య, శోభితా పెళ్లి చేసుకున్నా… 2027 లోగా విడిపోతారంటూ ఆయన జోస్యం చెప్పారు. దీనిపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. వేణుస్వామిపై చర్య తీసుకోవాలని కోరాయి. దాంతో రాష్ట్ర మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. కాగా వేణుస్వామి భార్య వాణి,  భర్తకు అండగా నిలిచింది. పైగా టాలీవుడ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News