Thursday, November 21, 2024

ఫేస్‌బుక్‌లో ఎస్‌ఐ ప్రేమాయణం… మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Women suicide with SI Face book love

జగిత్యాల: ఓ మహిళను ఎస్‌ఐ ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తోంది. ఫేస్‌బుక్‌లో సదరు మహిళతో ఓ ఎస్‌ఐకి పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు అప్పడప్పుడు కలుసుకుంటున్నారు.

ఎస్‌ఐ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో భర్తకు ఆమె విడాకులు ఇచ్చింది. ఎస్‌ఐ ఆమెను నమ్మించి కరీంనగర్‌లో ఓ రహస్య ప్రాంతంలో ఉంచాడు. అప్పటికే ఎస్‌ఐకి పెళ్లి జరిగిందని ఆమెకు తెలిసింది. అందులో ఎస్‌ఐ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. డిఎస్‌పి ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ వ్యవహారం బయటపడడంతో ఎస్‌ఐ సెలవుల్లోకి వెళ్లిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News