Monday, December 23, 2024

ఉరేసుకున్న మహిళా కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

లక్నో: భర్తతో గొడవ జరగడంతో మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని మడియాన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2016లో ఎస్‌ఎస్‌బిలో లఖిమ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె చౌక్ కొట్వాలి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె రూమ్‌లో ఉంటున్నారు. ఇద్దరు చిన్ని పిల్లలు కావడంతో గత తొమ్మిది నెలల నుంచి సెలవు తీసుకొని ఇంటి వద్దనే ఉంటుంది. సోమవారం భర్తతో గొడవ జరగడంతో ఆమె తన అద్దె ఇంట్లో ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. భర్త, అత్తగారిల్లు, అమ్మగారింటి నుంచి సమాచారం తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

లక్నోలోని రసూల్‌పూర్ ప్రాంతం గోసైన్‌గంజ్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలుడు ఆత్మహత్య చేసుకున్న మరో ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శత్రువులు తన కూమారుడిని చంపేసి ఉంటారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News