Monday, December 23, 2024

వరల్డ్ డెయిరీ సమ్మిట్‌లో మహిళా డెయిరీ ఫార్మర్స్ కు అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చికాగోలో జరుగుతున్న ప్రపంచ పాడిపరిశ్రమ సదస్సు వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడిస్తూ తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయ పాదాల చెంత వున్న భారతీయ మహిళా డెయిరీ సంస్థ శ్రీజ, పాడి పరిశ్రమ రంగం లో మహిళా సాధికారతలో ఆవిష్కరణకు గానూ అవార్డును అందుకుంది. దాదాపు 120,000 మంది మహిళా పాడి రైతుల తరపున ఈ అవార్డును స్వీకరించిన శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ (SMMPCL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయతీర్థా చారి మాట్లాడుతూ దేశంలోని మహిళా పాడి రైతులకు, సంస్థకు ఈ గౌరవం లభించడం గర్వించదగ్గ విషయమన్నారు. మహిళల నాయకత్వాన్ని పెంపొందించడానికి, పాడి పరిశ్రమలో వారికి తగిన సాధికారత కల్పించటానికి ఉద్దేశించిన అనేక కార్యక్రమాలు అమలు చేయడం కోసం ఇది పాడి పరిశ్రమలో ప్రపంచంలోనే అత్యధిక మహిళా సభ్యత్వాన్ని కలిగి ఉంది” అని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి(AHD) అల్కా ఉపాధ్యాయ పాల్గొన్నారు. ఈ అవార్డుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్‌డిడిబి, ఎన్‌డిడిబి డెయిరీ సర్వీసెస్, శ్రీజ మిల్క్‌లను అభినందించారు. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ (IDF) బోర్డుకు ఎన్నికైన NDDB & NDDB డెయిరీ సర్వీసెస్ (NDS) ఛైర్మన్ డాక్టర్ మీనేష్ షా మాట్లాడుతూ.. “భారతదేశంలో పాడి పరిశ్రమ విజయంలో మహిళలు అంతర్భాగంగా నిలిచారన్నారు. ఈ సంవత్సరం, IDF తమ మొదటి విమెన్ ఇన్ డెయిరీ నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 15 కేస్ స్టడీస్ ఉంటే, అందులో తాముమద్దతు అందించిన 4 కేస్ స్టడీస్ శ్రీజ, సఖి, ఆశా, పాయస్ కూడా వున్నాయనున్నారు.

శ్రీజ చైర్‌పర్సన్ కె శ్రీదేవి మాట్లాడుతూ…“అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు, అవార్డు 1.20 లక్షల మంది మహిళా పాడి రైతు సభ్యులకు లభించిన గౌరవం. ఇది మేము పనిచేస్తున్న రాష్ట్రాలలో మరింత కష్టపడి పనిచేయడానికి, దూకుడుగా విస్తరించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది” అని అన్నారు. ప్రస్తుతం కంపెనీ 3 రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & తమిళనాడు) లో 11 జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను తాకగలదని ఆశిస్తున్నట్లు శ్రీ చారీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News