Wednesday, January 22, 2025

బీరువాలో ప్రియురాలు మృతదేహం…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బీరువాలో మహిళ మృతదేహం కనిపించిన సంఘటన ఢిల్లీలోని ద్వారకా నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలో మస్ట్‌కిమ్‌కు రుఖ్సార్ రాజ్‌పూత్ అనే కుమార్తె ఉంది. రుఖ్సార్ గత రెండు నెలల నుంచి తన బాయ్ ఫ్రెండ్ విపల్ టైలర్‌తో సహజీవనం చేస్తుంది. పిఎస్ డాబ్రి పరిధిలోని ద్వారకా నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని రాజ్‌పూత్, రుఖ్సార్ నివసిస్తున్నారు.

వాళ్లు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో వెతకగా యువతి మృతదేహం బీరువాలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం డిడియు ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రి మస్ట్‌కిమ్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె ప్రియుడే తన కూతురిని చంపి ఉంటాడని తండ్రి ఆరోపణలు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు విపల్ గుజరాత్ చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News