Thursday, January 23, 2025

ప్లాట్ లో యువతి మృతదేహం నగ్నంగా…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: యువతి మృతదేహం నగ్నంగా కనిపించిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని సూర్యానగర్ పోలీస్ స్టేషన పరధిలో జరిగింది. మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  చందాపుర హెడ్ మాస్టర్ లేఔట్‌లో నాలుగో అంతస్థులో ఒడిశాకు చెందిన పవన్ కుమార్ ఉంటున్నాడు. అతడితో పాటు 28 ఏళ్ల యువతి కలిసి ఉండేది. ఆ ప్లాట్‌లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్లాట్‌కు చేరుకొని పవన్ కుమార్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. బలవంతంగా డోర్లు ఓపెన్ చేసి చూడగా నగ్నంగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కన్న మందు బాటిళ్లు, సిగరేట్లు, భోజనం పొట్లాలు కనిపించాయి. ఐదు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పవనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News