Thursday, January 23, 2025

విద్యార్థుల కార్ రేసింగ్: మహిళ ప్రాణాలు బలి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తన భర్తతో కలసి స్కూటర్‌పై వెళుతున్న ఒక మహిళను కారుతో ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన నగరంలోని సిఎఫ్‌ఎఐ బిజినెస్ స్కూలు విద్యార్థులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కియా కార్లతో రేసు పెట్టుకున్న బిజినెస్ స్కూలు విద్యార్థులు అత్యంత వేగంగా కారు నడిపి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఒక జంటను ఢీకొన్నారు. కారు దూసుకెళ్లడంతో శాంతమ్మ(55) అనే మహిళ మరణించగా ఆమె భర్త నరసింహులు(62) కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం  మంగళవారం మధ్య అర్ధరాత్రి నగర శివార్లలోని జన్వాడ గ్రామ శివార్లలో ఈ దారుణ సంఘటన జరిగింది. గృహిణి అయిన శాంతమ్మ ఈ సంఘటనలో అక్కడికక్కడే మరణించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రెండు కార్లు రేసింగ్ చేస్తుండగా ఒక కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న నరసింహులు, శాంతమ్మ కిందపడగా వేగంగా వచ్చిన మరో కారు శాంతమ్మ పైనుంచి దూసుకెళ్లింది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే, దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసు ఇన్‌స్పెక్టర్ వి శివకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News