Monday, December 23, 2024

చిరుత దాడిలో మాజీ సర్పంచ్ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిరుత పులి దాడిలో ఓ మాజీ సర్పంచ్ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గిద్దలూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెహరున్నీసా అనే మహిళ కట్టెల కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. ఘాట్ రోడ్డులోని వంక వద్ద ఆమె మృతదేహం గ్రామస్థులకు కనిపించడంతో పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పరీక్షించగా చిరుత దాడిలో మృతి చెందినట్టుగా గుర్తించారు. గిద్దలూరు గ్రామానికి గతంలో ఆమె సర్పంచ్‌గా సేవలందించారు. చిరుత సంచరిస్తుందనే తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయంతో వణికపోతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News