Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదం… పెళ్లి రోజునాడే చనిపోయింది…

- Advertisement -
- Advertisement -


సూర్యాపేట: పెళ్లి రోజు నాడే ఓ వివాహితను సెప్టిక్ ట్యాంకర్ ఢీకొనడంతో ఆమె మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లోడే శేఖర్(30), రేణకకు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. పెళ్లి రోజున శేఖర్-రేణుక తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి వెళ్లి లక్ష్మి నరసింహ్మ స్వామిని దర్శించుకోవాలని అనుకున్నారు. త్వరగా వంటలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పాలకూర తీసుకరావాడానికి రోడ్డుపైకి వెళ్లింది. పాలకూర తీసుకొని ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో తొర్రూర్ నుంచి వేగంగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. రేణుక మృతితో కుటుంబం సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News