Wednesday, January 22, 2025

తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సును ఢీకొట్టిన బైక్: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన దాసరి జ్యోతి తిరుమలలో బైక్‌పై ప్రయాణిస్తుండగా 16 మూలమలుపు వద్ద బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News