Monday, December 23, 2024

గుండెపోటుతో మహిళ మృతి… ముంబయి నుంచి జగిత్యాలకు వస్తుండగా

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: జగిత్యాలకు చెందిన మహిళ ముంబయి నుంచి సొంతూరుకు వస్తుండగా గుండెపోటుతో మార్గం మధ్యలో మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలోని పాటస్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోడిమ్యాట మండలం పూడూరుకు చెందిన పెద్ది కేతవ్వ(40) ముంబయిలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ముంబయి నుంచి తన కూతురుతో కలిసి పూడూరుకు వస్తుంది. పాటస్ ప్రాంతానికి శ్రీసాయిపూజా ట్రవెల్స్ బస్సులో వస్తుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. శ్రీసాయిపూజా ట్రావెల్స్ సహాయసహకారాలు అందించారు. మృతదేహాన్ని, మృతురాలు కూతురు, బంధువులను అంబులెన్స్‌లో వారిని ట్రవెల్స్ వారు పంపించారు. దీంతో ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రయాణికులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News