Tuesday, March 4, 2025

పిడుగు పాటుకు మహిళ మృతి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఒక మహిళ మృతి చెందగా మరొక మహిళ తీవ్రంగా గాయపడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో  బుడ్డమొళ్ళ సంగీత, అలివేలు అనే మహిళలు చెట్టుకింద తలదాచుకున్నారు. వాళ్లు ఉన్న స్థలంలో పిడుగు పడడంతో సంగీత మృతి చెందగా అలివేలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News