Sunday, December 22, 2024

ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: భవన నిర్మాణ కార్మికుల ట్రాక్టర్, మిల్లర్ బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ చనిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొలంపల్లి గ్రామం నుంచి నుస్తులాపూర్ వైపునకు వెళ్తున్న భవన నిర్మాణ కార్మికుల ట్రాక్టర్, మిల్లర్ నల్లగొండ శివారులో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో పొలంపెల్లి గ్రామానికి చెందిన రేణుక అక్కడికక్కడే చనిపోగా.. మ్యాకల సప్న, మ్యాకల శ్రీలత, వట్టె సరవ్వ, ప్యాట కోమలత తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్‌కు తరలించారు.
విషాదంలో రేణుక కుటుంబం..
ప్రమాదంలో మృతి చెందిన ఉప్పారపు రేణుకకు ఇద్దరు కొడుకులు. భర్త రాజయ్య కొన్నేళ్ల క్రితం చెట్టుపై పడడంతో నడుం విరగ్గా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు రేణుకే స్వీకరించింది. నేడు ఆమె కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News