Wednesday, January 22, 2025

శుభకార్యానికి వెళ్తూ..అనంతలోకాలకు

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: శుభ కార్యానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. శుక్రవారం మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మదుకర్(32)అతని భార్య రాపాక సౌజన్య(28), తన బాబాయ్ కుమారుడు రాపాక యశ్వంత్(10)లతో కలిసి భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి శుభకార్యానికి వెళుతుండగా బట్టుపల్లి గ్రామం వద్ద బస్సును ఢీకొన్నారు.  ఈ ప్రమాదంలో సౌజన్య అక్కడిక్కడే మృతి చెందగా, మధుకర్ కాలు విరగగా, యశ్వంత్ చెయ్యి విరిగి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాపాక మధుకర్ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి వైపు వెళ్తుండగా, మంథని నుండి భుపాలపల్లి వైపు వెళ్తున్న బస్సును ఢీ కొనగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి అటుగా నుండి మంథని వైపు వస్తున్న లారీకి ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన 108 ద్వారా మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News