Wednesday, January 22, 2025

పండుగ పూట విషాదం..

- Advertisement -
- Advertisement -

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని నీలిమ దాబా హోటల్ వద్ద మోటార్ సైకిల్‌ను కారు ఢీ కొనడం వల్ల బైక్ పై ప్రయాణిస్తున్న దంపతుల్లో భార్యకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాయాలైన భర్తను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం కనుగుట్ట గ్రామానికి చెందిన నల్ల లింగయ్య తన భార్య నర్సవ్వతో కలిసి బుధవారం రాఖీ పండుగ సందర్భంగా కనుగుట్టకు వెళ్లారు.

వృత్తిరీత్యా నిర్మల్ జిల్లా మంజులాపూర్ లో తాపీ మేస్త్రిగా పనులను నిర్వహిస్తున్నాడు. రాఖీ పండగ పూర్తి చేసుకొని గురువారం తిరిగి మంజులాపూర్‌కు లింగయ్య తన భార్య నర్సవ్వ (38), తమ్ముడు కల్యాణ్‌తో కలిసి బైక్‌పై ప్రయాణమయ్యాడు. నేరడగొండలోని నీలిమాదాబా వద్ద కారు బైక్‌ను ఢీకొనడంతో నర్సవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. నర్సయ్య, కల్యాణ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును నిర్లక్షంగా నడటం వల్లనే ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ సాయన్న తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News