Monday, December 23, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..శిశువుతో సహా గర్భీణి మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లాలో బుధవారం మధ్యహ్నాం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం 44 వ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు కింద పడిపోయారు. కాగా మహిళ మృతి చెందగా ఆమె కడుపులో ఉన్న ఏడు నెలల శిశువు కడుపు నుండి నుండి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయింది.

ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. మిరుదొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుండి దండుపల్లి కి బైక్ పై వెళ్తూ జాతీయ రహాదారి క్రాస్ చేస్తుండగా తుప్రాన్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News