Monday, January 13, 2025

మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై జోక్యం ఉండదు

- Advertisement -
- Advertisement -

మహిళలపై మతపరమైన దుస్తుల నియమావళి ఏదీ విధించబోమని సిరియాలో అధ్యక్షుడు బషర్ అస్సద్‌ను పదవీచ్యుతుడిని చేసిన తిరుగుబాటువాదులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ గ్యారంటీ ఉంటుందని వారు శపథం చేశారు. ‘మహిళల దుస్తులపై జోక్యం కచ్చితంగా నిషిద్ధం, వారి వస్త్రధారణకు లేదా ఆహార్యానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలూ విధించే ప్రసక్తి లేదు’ అని తిరుగుబాటువాదుల జనరల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుందని, వ్యక్తుల హక్కుల పట్ల గౌరవం నాగరిక దేశ నిర్మాణానికి ప్రాతిపదిక అని తాము స్పష్టం చేస్తున్నట్లు కమాండ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News