Monday, December 23, 2024

ఎసి పేలడంతో మహిళా ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎసి పేలడంతో ఓ మహిళా ఉద్యోగి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. దామర్ల శ్రీదేవి(52) భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద జడ్పి కార్యాలయంలో పని చేస్తుంది. చీమకుర్తి మండల కేంద్రంలో తన కూమారుడి సాయితేజతో కలిసి శ్రీదేవి జీవనం సాగిస్తోంది. హైఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో ఎసి పేలి గదిలో పొగలు కమ్ముకున్నాయి. వాళ్లు గాఢనిద్రలో ఉండడంతో వాయువును పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు స్పందించి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీదేవి మరణించింది. ఆమె కుమారుడు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News