Wednesday, January 22, 2025

లిఫ్ట్ అడిగిన పాపానికి వ్యభిచారినిగా ముద్ర.. ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్: లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ మహిళను వ్యభిచారినిగా చిత్రీకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఏలూరు జిల్లా దెందులూరులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే సుంకర పావని (35) ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి బయలు దేరింది. అటు వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. ఆమె బైకుపై ఎక్కగా పాత నేరస్థుడు బోను శివకృష్ణ ఆమె ఫోటోలు, వీడియోలను చిత్రీకరించాడు.

అనంతరం తోటి నేరస్థులతో కలిసి కోరిక తీర్చాలని బెదిరించాడు. ఆమె వినకపోవడంతో వ్యభిచారినిగా చిత్రీకరిస్తూ వీడియోలను గ్రామస్తులందరికీ షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న పావని మనస్థాపానికి గురై ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పావని మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News