Friday, November 22, 2024

టైమ్ మ్యాగజైన్‌పై ‘మహిళా రైతులు’

- Advertisement -
- Advertisement -

'Women Farmers' on Time Magazine

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాకు చెందిన ప్రముఖ ‘టైమ్’ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళా రైతుల ఫొటోతో ఉన్న ఈ ప్రత్యేక సంచిక కవర్‌పేజిని ఆ మ్యాగజైన్ శుక్రవారం ట్విట్టర్‌లో విడుదల చేసింది. ‘ నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు’ అన్న శీర్షికతో టైమ్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఉద్యమంలో పాల్గొనడమే కాదు.. ముందుండి నడిపిస్తున్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతుల అనుభవాలను, బాధలను ఈ కవర్‌స్టోరీలో రాసుకొచ్చింది. నూతన సాగు చట్టాలపైనే కాకుండా పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెన్నుచూపకుండా ఉద్యమం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా కిసాన్ దివస్’గా నిర్వహించాలని రైతు నేతలు నిర్ణయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News