Saturday, November 2, 2024

మద్యాన్ని నియంత్రించి, మహిళలపై హింసను అరికట్టాలి: ఐద్వా

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించి బాలికలు, మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలను, హింసను అరికట్టాలని ఐద్వా జిల్లా సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ. పద్మ, కె. నాగలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి మాట్లాడుతూ యువతను పెడమార్గం పట్టిస్తూ, మహిళలపై హింసకు కారణమవుతున్న మద్యాన్ని ప్రభుత్వం తక్షణం నియంత్రించాలని కోరారు. మద్యం, మాదక ద్రవ్యాలు, అశ్లీల వెబ్‌సైట్‌తో యువత చెడు మార్గం పట్టి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారనీ, అత్యాచార కేసుల్లో దోషులు మద్యం సేవించినట్లు తేలుతోందని,దీంతో మద్యాన్ని, మత్తు పదార్దాలను, అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఐద్వా నాయకులు షబానాబేగం, పి.శశికళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News