Monday, March 17, 2025

బస్సులో సీటు కోసం.. బూట్లతో కొట్లాట!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు చూపిస్తే.. చాలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణం చేసే అవకాశం లభించింది. అయితే ఈ పథకం అమలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని బస్సుల్లో అయితే.. సీట్లు దొరకక ప్రయాణికులు తెగ ఇబ్బంది పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ బస్సులో సీట్ల కోసం మహిళలు చెప్పులతో దాడి చేసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

హకీంపేటకు చెందిన బస్సులో ముగ్గరు మహిళలు ఎక్కగా.. బొల్లారం స్టాప్ వద్ద ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. అయితే మరో మహిళ ఒక మహిళకు మద్ధతు ఇవ్వడంతో వాగ్వాదం పెరిగిపోయింది. మాటలు కాస్త ఒకరిపై ఒకరు బూట్లతో దాడి చేసుకొనే వరకూ పెరిగిపోయింది. కండక్టర్ వారిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బొల్లరం పోలీస్ స్టేషన్‌లో కండక్టర్ ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News