Monday, December 23, 2024

వృద్ధుడికి మత్తు మందు ఇచ్చి…. అశ్లీల ఫోటోలు షేర్ చేసి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ కిలాడీ లేడీ  వృద్ధుడితో సన్నిహితంగా ఉండడంతో పాటు అతడి వద్ద అప్పు తీసుకుంది. అప్పు అడిగినందుకు అతడి అశ్లీల ఫోటోలు వాట్సాప్‌లో షేర్ చేసి బెదిరించిన సంఘటన కర్నాటకలోకి దావణగెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సరస్వతి నగరంలో యశోదా అనే మహిళ నివసిస్తుంది. ఆమెకు శివకుమార స్వామి లేఔట్‌కు చెందిన చిదానంద అనే వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడడంతో పలుమార్లు ఇంటికి పిలిచి అతడికి కాఫీ ఇచ్చింది.

తన బాధలు చెప్పుకొని అతడి వద్ద 86 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. అప్పు చెల్లించకపోవడంతో చిదానంద డబ్బులు ఇవ్వాలని పలుమార్లు ఆమెను అడిగాడు. వాకింగ్‌కు వెళ్తున్న వృద్ధుడిని ఇంటికి పిలిచి మత్తు మందు కలిపిన కాపీ ఇచ్చింది. అతడు స్పృహలోకి వచ్చేసరికి ఒంటి మీద బట్టలు లేవు. వెంటనే అతడు దుస్తువులు వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. తన వద్ద అశ్లీల వీడియోలు ఉన్నాయని 15 లక్షల రూపాయలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. వెంటనే అతడు తన బాధను స్నేహితుల వద్ద చెప్పుకున్నాడు. నగ్నంగా ఉన్న ఫోటోను అతడి వాట్సాప్‌కు పంపించింది. వెంటనే వృద్ధుడి కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి కిలాడీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News