Thursday, January 23, 2025

రోడ్డు పైనే ప్రసవించిన మహిళ…

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : గర్భిణి మహిళ రోడ్డు  పైనే ప్రసవించిన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది. గర్భిణి మహిళ నడుచుకుంటు వెళ్తుండగా ఒక్కసారిగా పురిటి నొప్పులతో బాధపడుతూ నడి రోడ్డు పై నరకయాతన అనుభవించింది. రోడ్డు పై వెళ్తున్న పాదాచారులు కానీ, వాహనదారులు కానీ ఆ మహిళను పట్టించుకోలేదు. అక్కడే ఉన్న స్థానిక వ్యాపారస్తులు గర్భిణి చుట్టు అట్ట ముక్కలు పెట్టి ప్రసవం చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళ, పుట్టిన బాబు ఆరోగ్యంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News