Sunday, December 22, 2024

దళిత మహిళపై దారుణం

- Advertisement -
- Advertisement -

బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్ధాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు స్పృహ తప్పి మూర్చ పోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదు దారుడితో బాధితురాలి తలకు కాళ్లకు జండూ బామ్ రాయించారు. ఫిర్యాదు దారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తోంది. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్ ,అఖిల, అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు ఆయన భార్యను, వారి మైనర్ కుమారుడును అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు. డిఐ రాంరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు పేర్కొంది పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి మైనర్ కుమారుడు ముందే చితకబాదారు. దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన మైనర్ కుమారుడును కూడా అరికాళ్ళపై రబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టు బాధితులు పేర్కొన్నారు. కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా సునితను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం.

బంగారం దొరికింది
నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు అయితే మొత్తం 24 తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, అందులో నుండి ఒక తులం బంగారం, నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు,

అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం : డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామ్ రెడ్డి
జరిగిన దారుణ ఘటనపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని, ఆమె పై విచారణ కొనసాగిస్తున్నామని, విచారణలో భాగంగా స్టేషన్‌కు తీసుకు వచ్చామన్నారు అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారెంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి పోలీసులు కొట్టిన దెబ్బలతో బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకనే రిమాండ్ చేయ్యలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఘటనపై విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశం..!?
24 తులాల బంగారం, రూ.2 లక్షలకుగానూ కేవలం తులం బంగారం, రూ.4,000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించడం వెనక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్‌కు తరలించాలి గానీ, ఒక పేద ఎస్‌సి మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News