Monday, December 23, 2024

మైనార్టీ కోచింగ్ సెంటర్లో సగం మంది స్త్రీలు ఉండాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, సిటీబ్యూరో: మైనారిటీ సంక్షేమ శాఖ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కోచింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా 50శాతం స్త్రీలు ఉండేలా చూడాలని జాతీయ మైనారిటీ కమీషన్ చైర్ పర్సన్ సయ్యద్ షెహాజాదీ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన మైనారిటీల అభివృద్ది కోసం తీసుకుంటున్న చర్యలపై జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో ముఖ్యమంత్రి పోటోతో పాటు ప్రధానమంత్రి పోటో కూడా పెట్టాలని సూచించారు. జిల్లాలోని వక్ఫ్ భూముల గురించి తహాసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా మైనారీ సంక్షేమాధికారి ఆమెకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇండ్లను మైనార్టీలకు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తహాసీల్దార్లు వారి పరిధిలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను తప్పకుండా సందర్శించాలని అక్కడి పరిస్దితులను స్వయంగా తెలుసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ మురికివాడల్లో నివసిస్తూ ఇండ్లు కోల్పోయిన వారికి మాత్రమే రెండు పడకల గదుల ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి యం.డి. ఖాసిం, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, వసంత కుమారి, జిల్లాలోని తహాసీల్దార్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News