Sunday, December 22, 2024

కెటిఆర్ భద్రాచలం పర్యటనలో అపశృతి..

- Advertisement -
- Advertisement -

భద్రాచలం ః రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ భద్రాచలం పర్యటనలో భాగంగా కొత్తగూడెం నుండి బందోబస్తుకు వచ్చిన మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి శనివారం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సమీపంలోని విస్తా కాంప్లెక్ వద్ద కాలు జారి వరద కాలువలో పడి దుర్మరణం పాలయింది. భారీ వర్షం కారణంగా ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలో ఆమె పొరపాటున కాలు పడినట్లు చూసినవాళ్లు చెబుతున్నారు. వెంటనే ఆమె ఆచూకి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు గంటకు పైగా వెతికారు. చివరికి కరకట్ట స్లూయిజ్ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ సంఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఆమె ఇద్దరు పిల్లలు భర్త ఉన్నారు. భర్త రామారావు కూడా పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, సంఘటన వివరాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపి మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. తెల్లం వెంకట్రావులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News