Wednesday, January 22, 2025

బ్రేకులకు బదులు యాక్సిలేటర్ తొక్కిన మహిళ: బైకర్ మృతి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బైకును వెనుక నుంచి కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన మహిళను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బ్రేకులు వేయడానికి బదులు తాను యాక్సిలేటర్ తొక్కానని కారును నడిపిన ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ చర్య వల్ల ఒక నిండుప్రాణం బలైపోయిందని వారు పేర్కొన్నారు.

కారును డ్రైవ్ చేసిన మహిళను శుభగా పోలీసులు గుర్తించారు. బెంగళూరకు చెందిన ఆ నడివయసు మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. బిజీగా ఉండే హేసరఘట్ట మెయిన్ రోడ్డులోని బగలగుంటె జంక్షన్ సమీపంలో మంగళవారం ఈ దారున ప్రమాదం సంభవించింది. తన కుమారుడు వేదాంత్‌తో కలసి సంజయ్ బాబు అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టి వారిపై నుంచి దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో సంజయ్ బాబు మరణించగా ఆయన కుమారుడు వేదాంత్ గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దారుణం సిసి టివి కెమెరాలో రికార్డయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు కారు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్షంగా కారును నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News