Monday, January 20, 2025

సాయుధ దళాల్లోకి సిడిస్ ద్వారా మహిళల ప్రవేశం

- Advertisement -
- Advertisement -

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సిడిఎస్) పరీక్ష ద్వారా సాయుధ దళాల్లోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన ప్రాతినిధ్యంపై ఎనిమిది వారాల్లోగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. భారత సాయుధ దళాలకు చెందిన ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఎ), ఇండియన్ నేవీ అకాడమీ (ఐఎన్‌ఎ) , ఎయిర్ ఫోర్స్ అకాడమీల్లోకి మహిళల ప్రవేశంపై పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తుపై ఇంకా ప్రభుత్వ అధికార యంత్రాంగం వద్ద పెండింగ్‌లో ఉందని తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం శుక్రవారం గుర్తు చేసింది. చట్ట ప్రకారం ఈ ప్రాతినిధ్యంపై ఎనిమిది వారాల్లో చేసే నిర్ణయంపై ప్రతివాదికి ఆదేశాలిస్తూ రిటి పిటిషన్‌ను పరిష్కరించడమౌతుందని ధర్మాసనం కేంద్రానికి సూచించింది.

ఈ పరీక్షకు హాజరు కావడంలో అన్యాయంగా మహిళలను మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని పిటిషనర్ వాదించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ( ( ఎన్‌డిఎ) పరీక్ష ద్వారా మహిళల ప్రవేశానికి అవరోధాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తొలగించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఫలితంగా అనేక మంది మహిళా అభ్యర్థినులు ఏటా రిక్రూట్ అవుతుండగా, సిడిఎస్ పరీక్ష ద్వారా మహిళల ప్రవేశానికి ఆంక్షలు విధించడమేమిటని పిటిషనర్ వాదించారు. అర్హులైన మహిళా అభ్యర్థినులను శిక్షణ సంస్థల ప్రవేశం నుంచి మినహాయించడమంటే సమానత్వం పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News